Breaking News

తెహెల్క న్యూస్, సిద్దిపేట్ : క్రీడాభివృద్ధికి రూ.11కోట్లు మంజూరు చేసిన మంత్రి హరీశ్ రావు…..

తెహెల్క న్యూస్, సిద్దిపేట్ : క్రీడాభివృద్ధికి పెద్దపీట వేసి రూ.11కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు స్పోర్ట్స్ క్లబ్ కోరిక మేరకు గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ ట్రాక్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 

పట్టణంలోని జయశంకర్ స్టేడియంలో బాస్కెట్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఏస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ మేరకు కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం బాస్కెట్ బాల్ క్రీడను కాసేపు ఆసక్తిగా వీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్నీ క్రీడలకు సిద్ధిపేట నిలయంగా మారిందని పేర్కొన్నారు. సింథటిక్ ట్రాక్ తో బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేసినట్లు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్ధిపేట ఖ్యాతి తెచ్చేలా తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. అంతకు ముందు టీఏస్ఈడబ్ల్యూఐడీసీ-చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని సిద్ధిపేట క్రీడాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా వాలీబాల్ అకాడమీలో క్రీడాకారులకు అడ్మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాలసాయిరాం, సిద్దిపేట బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నే మహేష్ కుమార్, సిద్ధిపేట స్పోర్ట్స్ క్లబ్ అన్నీ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, పీఈటీలు పాల్గొన్నారు.