Breaking News

తెహెల్కా న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత…..

తెహెల్కా న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సీజ్ చేశారు. కవాడిగుడా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 9లక్షల డబ్బును గుర్తించారు.

కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం వేర్వేరు చోట్ల మొత్తం రూ.3,14,58,300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్‌-జగిత్యాల జిల్లాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో ఓ కారులో గుర్తించిన రూ.1.44 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దస్తురాబాద్‌ మండలం మున్యాల్‌ గ్రామంలో బెల్టు షాపులపై దాడి చేసి 15.55 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ వద్ద రెండు కార్లలో 53 తులాల బంగారం పట్టుబడింది. చేవెళ్ల మండలం అంతారం స్టేజీ వద్ద తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న రూ.2లక్షలు పట్టుకున్నారు. ఇక, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వాహన తనిఖీల్లో పోలీసులు రూ.2.01 లక్షలు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలో రూ.లక్ష, పెద్దపల్లి జిల్లాలో రూ.60 వేల నగదు స్వాధీ నం చేసుకున్నారు. ఇక, హైదరాబాద్‌, రాయదుర్గం పోలీసులు శనివారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.51లక్షల నగ దు, రూ.లక్ష విలువైన మద్యం సీసాలు సీజ్‌ చేశారు. నేరేడ్‌మెట్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ ద్విచక్రవాహనదారుడి వద్ద రూ.3,40,000 గుర్తించి సీజ్‌ చేశారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.39.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.