Breaking News

క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేక ఓ జంట ఆత్మహత్య..

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘ‌ట‌న మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. . కిసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల బాధతో దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఈ చిన్నారులను బంధువుల వద్దకు పంపి శనివారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.