Breaking News

మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి విదేశాలకు 43 మంది స్టూడెంట్స్.. . భారతదేశంలో మొదటిసారి.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ సైన్సెస్ నుండి 43 మంది విద్యార్థులు విదేశాలకు ఎంపికయ్యారు. అమెరికా, నెదర్లాండ్స్‌లో వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు ఎంపికయ్యారు. మొదటగా ఈ నెల 19న ఇద్దరు విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఈ నెల చివరి వారంలో మరో 30 మంది విద్యార్థులు అమెరికాకు, 13 మంది విద్యార్థులు నెదర్లాండ్స్‌కు వెళ్లనున్నారు.

భారతదేశంలోనే తొలిసారిగా మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ విద్యార్థులను అమెరికా, నెదర్లాండ్స్‌కు పంపినట్లు అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి వెల్లడించారు. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఎంపికైన విద్యార్థులను మాజీ మాజీ మంత్రి, మల్లారెడ్డి గ్రూప్స్ అధినేత చామకూర మల్లారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు అమెరికా, నెదర్లాండ్స్‌కు వెళ్లేందుకు గొప్ప అవకాశం వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ యూనివర్సిటీకి చెందిన 43 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లడం సంతోషంగా ఉందని చెప్పారు.