Breaking News

కొడుకు భక్తికి పుస్తెలతాడు తాకట్టు పెట్టి సమ్మక్క గద్దెలు నిర్మించిన తల్లి…

సమ్మక్క దేవతను పేద ప్రజలకు కొంగుబంగారంగా ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లి మొక్కలు చెల్లించుకుంటారు. ఇలా ప్రతి ఏటా మొక్కి వస్తుండడంతో కొడుకు కార్తీక్ కు దేవుడు రావడంతో తన ఎకరం భూమిలోనే సమ్మక్క సారలమ్మ గద్దెలు నిర్మిస్తూ భక్తిని చాటుకుంటున్నారు ఓ కుటుంబీకులు. రాజపేట మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామంలో వెంకటాపురం ప్రేమలత బాలరాజు లకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు కార్తీక్ 1996లో జన్మించాడు. ఐటిఐ చదివిన కార్తీక్ 12 వ ఏటనే దేవుడు రావడం, పూనకాలు రావడం ప్రారంభమైంది. తన తండ్రి బాలరాజు దేవుడు లేదు ఏమీ లేదని కార్తీక్ ను ఇంటి నుండి వెళ్లగొట్టాడు. దేవుడు ఎలా వస్తాడు అంతా బూటకమని పట్టించుకోకపోవడంతో కార్తీక్ మాత్రం ప్రతి ఏడు సమ్మక్క జాతరకు వెళ్లి వచ్చేవాడు.

మూడు తులాల బంగారం తాకట్టు పెట్టి గద్దెల నిర్మాణం

ప్రతి ఏటా సమ్మక్క జాతరకు వెళ్లి వచ్చిన కార్తీకక్కు గద్దెల నిర్మించాలని సంకల్పము కలిగినది. ఎన్ని రోజులు తండ్రి వద్దన్నప్పటికీ ఎలా అని ఆలోచించుకుంటుంటే ఆ తల్లికి మొక్కుకున్న కార్తీక్ తన తండ్రి మనసు మార్చాలని వేడుకున్నాడు. ఇంతలోనే తన తండ్రికి స్వప్నంలో నీడలా వచ్చి కనిపించడంతో సమ్మక్క గద్దెల నిర్మాణానికి పూనుకున్నాడు. ఆలేరు ఒక బ్యాంకులో తన భార్య పుస్తెలతాడు, కమ్మలు తాకట్టు పెట్టి లక్ష దీ రూపాయలు అప్పు తీసుకువచ్చి సమ్మక్క సారలమ్మ గద్దెలు నిర్మిస్తున్నారు.

పెళ్లి చేసుకోకుండా దేవుని సేవలో కొనసాగుతాను అంటున్న కార్తీక్

పెళ్లీడుకొచ్చిన కొడుకుకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు కార్తీక్ ను సూచించగా తను పెళ్లి చేసుకోనని, దేవుడు సేవలోనే కొనసాగుతానని పట్టుపట్టాడని, తల్లిదండ్రులు బాలరాజు ప్రేమలత దిశకు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలు కొడుకు భక్తిని గమనించి దేవుని కొలుచుకుంటున్న తీరు చూసి గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.

అందరూ ఆహ్వానితులే

సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి ఒక్కరు రావాలని కార్తీక్ కోరారు. 21న సారలమ్మ గద్దెకు వచ్చుట, 22న సమ్మక్క గద్దెకు వచ్చుట, 23న మొక్కులు చెల్లించుట, 24న వన ప్రవేశం చేయనున్నట్లు తెలిపారు.