Breaking News

భార్య నోట్లో గుడ్డలు కుక్కి..కళ్లముందే భర్తను హత్య చేసిన దుండగులు.

ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. భార్య నోట్లో గుడ్డలు కుక్కి కళ్ల ఎదుటే భర్తను దారుణంగా హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సూచన మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.పాత కక్షల తో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుమారుడి హత్య వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.