Breaking News

నేడు మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న..

బుధవారం నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను మంగళవారం మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాలు, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు.
నాలుగు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలు మూతపడతాయని ప్రభుత్వం ప్రకటించింది. మేడారం జాతరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.మేడారం జాతర రేపు ప్రారంభమవుతుంది. ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు నాలుగు రోజులు సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఈ నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.