Breaking News

ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌.

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పర్వం ముగిసింది. అధికారులు ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.. మొత్తం 10 రోజుల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు పురోగతిని కోర్టుకు నివేదించింది మరియు ఆమెను 15 రోజుల రిమాండ్‌కు పంపాలని అభ్యర్థించింది, అయితే ఆమెను 14 రోజుల పాటు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు.ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమెను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. రాజకీయ, వ్యాపారవేత్తల వరుస అరెస్టులు, విచారణలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపిస్తూ ఈ నెల 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, 16న ఢిల్లీ లోని పీఎంఎల్ఏ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చింది. అటు కవిత, ఇటు ఈడీ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం, వారం పాటు ఆమెను కస్టడీకి అనుమతించింది. ఈ సమయంలో వివిధ అంశాలపై కవితను విచారించిన అధికారులు, లిక్కర్‌ కేసుకు సంబంధించి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. కస్టడీ గడువు గత శనివారంతో ముగియడంతో ఈడీ అధికారులు, మళ్లీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజులు కస్టడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గడువు ఇవాళ్టితో ముగియడంతో కవితను మరోసారి కోర్టు ముందు హాజరుపర్చారు. ఆన్లైన్లో హాజరైన ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్, కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు – కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా క్రమంలో కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. మరోవైపు కవితను తీహాడ్ జైలుకు పంపేందుకు కోర్టు ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కుమారుడి పరీక్షల దృష్ట్యా కవిత మధ్యంతర బెయిల్‌ కోరగా ఆ పిటిషన్‌పై ఏప్రిల్‌ ఒకటిన విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.