Breaking News

కెనడా అమెరికాలో భారతీయుల వరస మరణాలు.

కల్కిస్థాన్ తీవ్రవాదుల కు పౌరసత్వం మంజూరు చేసిన అత్యున్నత దేశం కెనడా . కెనడాలోని సౌత్ ఎడ్మంటన్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గిల్ బిల్ట్ హోమ్స్ యజమాని బూటా సింగ్ గిల్ (49) మరణించారు. బూటా సింగ్‌తో సహా మరో వ్యక్తి మృతి చెందినట్లు ఎడ్మంటన్ పోలీసులు తెలిపారు. కావానాగ్‌లోని నైరుతి చెర్నియాక్ వే పరిసరాల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుటాసిన్‌తోపాటు మరో 57 ఏళ్ల వ్యక్తి మరణించారు. మరో 51 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరు కాల్చారు? హత్యకు కారణమేంటి? వివరాలు వెల్లడించలేదు. స్థానిక ప్రజలతో బూటా సింగ్‌కు మంచి అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఎడ్మాంటన్ మాజీ నగర కౌన్సిలర్ మొహిందర్ బంగా మాట్లాడుతూ ఎవరికైనా అవసరమైన సహాయం చేస్తానని చెప్పారు.