Breaking News

శ్రీ సీతారాముల కళ్యాణం లోక కల్యాణర్థమే.

ఇతిహాస సంస్కృతి పరంపర కొనసాగింపే సీతా రామ కళ్యాణం వాడవాడలో ఊరు
ఊరులో సీతారాముల కళ్యాణం చూతము రారండి…
భారతదేశ వైదిక సంప్రదాయంలో ఉత్సవాలు పండుగలు ఆచారాల సాంప్రదాయాలకు నిలువుటద్దమై నిలుస్తాయి.
దేశీయ సంస్కృతిలో రామాయణంలోని ఘట్టాలు చిరస్మరణీయమైన ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కోవలోనే సీతారామ కళ్యాణం వాడవాడలా ఊరూరా అత్యంత వైభవంగా జరగడం ఆనందదాయకం తమ ఇంట్లో జరిగిన వివాహంగానే ప్రతి భారతీయుడు భావించడం సంతోషదాయకం. మన ఇతిహాసమైన రామాయణంలో సీతా స్వయంవరం సంబంధించిన విషయం నేటి యువతరం పరిశీలించవలసిన విషయం ఎంతైనా ఉంది. శివధనస్సును విరచడం అదేవిధంగా రాముని వైపు సీతవైపు అటూ ఏడు తరాలు ఇటు ఏడు తరాల సంబంధించిన చరిత్రను వివరించడం అప్పటి సంప్రదాయాలను ఆచారాలను మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.
=శివ ధనస్సు ఎక్కడిది..
జనక మహారాజు వంశములోని ఆరో చక్రవర్తి దేవరాతుడు గొప్పమహా రాజు కు శివుడు దీన్ని ఇవ్వడం జరిగింది. దక్షయజ్ఞ ధ్వంసం చేసే సమయములో ఆయన హవిర్భావం శివునికి దక్కలేదు కాబట్టి దీనితో మీ తలల్ని బద్దలు చేస్తానన్నాడు అక్కడే వున్న రాజులు దేవతలు వినయంతో ఆ శివున్ని వేడుకున్నారు ఆయన నుండి దీన్ని కానుకగా పొందారు. ఆ దేవతలు దేవరాతునికి అంటే జనకుని ఆరో వంశ రాజైన దేవరాతుని కాలం నుండి జనకుని ఇంట్లో ఉంది మహా చాపం .
నాగేటి తో భూమిని దున్నుతున్న సమయంలో సీత అనే బిడ్డ లభించింది ఆమెను జనకుడే స్వయంగా పోషించారు ఎవరైతే ఈ శివ ధనస్సును ఎక్కు పెడతారో వారికి సీతను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించడం జరిగింది. ఎందరో రాజులు శివధనస్సును ఎక్కు పెట్టడానికి ప్రయత్నించారు. చేసేదిలేక వెనిదిరిగి పోయారు ,ఇది గంధం మాల్యాలతో పూజలు అందుకున్న దివ్యమైన శాపం దేవ దానవ గంధర్వాదులు దీనిని ఎక్కు పెట్టలేకపోయారు ఆ ధనస్సుని ఎక్కువ పెట్టమని శ్రీరాముని ఆదేశించాలని జనకుడు శ్రీ విశ్వామిత్ర మహర్షిని కోరారు ఆ విధంగా ఆ వింటిని అవలీలగా పట్టుకోగానే అది ఫెటిల్ మని విరిగింది. పిడుగుపాటు ను పోలిన ధ్వని వినిపించింది, ఆ సమయంలో నేల అదిరింది, కొండలు బద్దలైయ్యాయి. విశ్వామిత్ర మహర్షి జనకుడు, రామలక్ష్మణులు, తప్ప దక్కిన ప్రజల ఎల్లరు ఆధ్వనికి మూర్చ చెందారు.
=రాముని వంశ చరిత్ర ఎంతో ఘనము—

 • సీతారాముల కల్యాణార్థం విశ్వామిత్రుని పిలుపుమేరకు మిథిలా నగరానికి విచ్చేసిన దశరథ మహారాజ ఈ సందర్భంగా దశరథ మహారాజు యొక్క మూల గురువు వశిష్ట మహర్షి రాముని యొక్క వంశ వృత్తాంతమును ఈ విధంగా వివరించడం జరిగింది.
  శ్రీరామచంద్రుని యొక్క వంశక్రమంలో బ్రహ్మ మొదట, తదుపరి మరీచి, మరీచికి కాశ్యకుడు, కాశ్యపునికి సూర్యుడు సూర్యుని కొడుకు
  వైవాస్వత మనువు. ఇతడు ప్రథమ ప్రజాపతి మనవు కొడుకు ఇక్షాకుడు, అయోధ్యకు మొదటి రాజు ఇతడే .అదేవిధంగా ఇక్షాకుని కుమారుడు కుక్షి కి వికుక్షి ,వికుక్షికి బానుడు ,భానునికి పృతువు, పృతువుకి త్రిశంకు, త్రిశంకునికి దొందుమారుడు, దుందుమారునికి యమునత్సుడు, నాయకుడు అదేవిధంగా యవనాశ్యునికి మాంధాత, మాందాతకి సునంది, సునందికి ధ్రువనంది, ప్రసేజిత్తు అనే ఇద్దరు ధ్రువనందికి భరతుడు ,భరతునికి అసితుడు కుమారులుగా జన్మించారు.
  వంశరాజులతో ఎడతెగని వైనంతో ఆయనతో ఆయన వాళ్లతో పోరు లేక రాజ్యం వదిలి గర్భవతులైన తన ఇద్దరు భార్యలతో హిమదత్తుతము చేరి చనిపోయేదాకా అక్కడి నివసించారు. ఆయన భార్యలో ఒకటే తన సవతి గర్భాన్ని నాశనం చేయాలని సంకల్పించి కాలిందినికి విశాన్నం పెట్టింది. అదే సమయంలో భృగు మహర్షి కొడుకు చవనుడు హిమవంతునికి వచ్చాడు కాలింది ఆయనకు పరిచర్యలు చేసింది. సగరుడు సగరునికి అసమంజుడు సమంజునికి అంశుమంతుడు అంశమంతునికి దిలీపుడు దిలీపునకు భగీరథుడు భగీరతునికి కకు శ్రేష్టుడుకి రఘువు రఘవకు ప్రవృద్ధుడు వీలు కుమారులుగా జన్మించాడు. ప్రవృద్ధుడు వశిష్టుని శాపం వల్ల నరమాంసభక్షుడయ్యాడు అందుకే ఆయన వశిష్టుని శపించాలని జలాన్ని పైకి ఎత్తాడు అంతులో ఆయన భార్య భర్తను వారించింది ఆయన ఆ నీటిని ఆ ఈయన పాదాలపై చిలికాడు అందువల్ల తాను కల్మషపాదుడయ్యాడు అతని కొడుకు శంఖుడు శంఖునికి సుదర్శనుడు, సుదర్శన్ కి అగ్నిపర్ణుడు అగ్నిపర్ణునికి శీఘ్రకుడు, ప్రశుక్రునకు అంబరీష్యుడు, అంబరీషునికి సహోరు ,సహోస్వానికి యాయాది ,యాయాదికి నాబాగుడు, నా బాగునికి అజుడు పుత్రులుగా జన్మించారు. ఈయన కుమారుడు రామ లక్ష్మణ భరత శత్రాఘ్నులు ఇక్ష్వాకు వంశ సంబంధించిన అతి ప్రాచీన కాలం నుండి మహా పవిత్రంగా ఈ వంశము రాణించిందని వశిష్ట మహర్షి ఈ విధంగ రాముని యొక్క పూర్వ వంశ చరిత్రను వివరించడం జరిగింది.
  -సీతా దేవి వంశ క్రమం;—–
  శ్రీరామచంద్రుని యొక్క వంశ చరిత్రను వారి మూల గురువైన వశిష్ట మహర్షి భిన్నవించిన వెంటనే స్వయంగా జనకుడే తన వంశ చరిత్రను వివరించడం విశేషం తమ వంశానికి మూల పురుషుడు నిమి ఆయన కొడుకు మితి మితియే మిథిలాపుర నిర్మాత ఆయనే ప్రథమ జనకుడు ఆయన కొడుకు ఉదావసుడు ఉదావసునికి నందివర్ధనుడు నందివర్ధనునికి సుకేతుడు సుకేతునికి దేవరాథుడు దేవరాత్రులకు బృహప్రతుడు బృహ ద్రతునికి మహావీరుడు ,మహావీరునికి శుభ్రతి, శుద్రతికి దుష్ట కేతువు, దుష్ట కేతునికి హర్య సృగులు, హర్షసునికి మరువు, మరునికి ప్రతితవంతుడు, ప్రతింధనునికి కీర్తిరతుడు, కీర్తిరతునికి దేవా మీతుడు, ఇతని కొడుకు విలువదునికి మహీద్రకుడు, మహీంద్రా కునికి కీర్తి రాశుడు ,కీర్తి రాశులకి మహోదముడు, మహోదమునికి స్వర్ణ రాముడు అశ్వముడు ఇతని కొడుకు హర్ష రోమన్కిద్దరు సుతులు వారిలో జనకుడనే నేను పెద్దవాన్ని ఈ కుశధ్వజుడు రెండో కొడుకు మా కొడుకు మా తండ్రి నన్ను రాజ్యాధిపతిగా నియమించాడు కుసద్ధుని పోషణ భారం నా యొక్క నాపై ఉంచి మా తండ్రి అడవికి వెళ్ళాడు ఆ తర్వాత ఆయన మరణించాడని జనకుడు తన వంశక్రమాన్ని స్వయంగా వివరిస్తూ వివాహ ది కార్యక్రమాల్లో తల్లి తండ్రులు వారి యొక్క వంశ చరిత్రను ఏ విధంగా ఉండవలెను సీతారామ కళ్యాణ సందర్భంలో వంశక్రమాన్ని ఈ విధంగా వివరించడం జరిగింది.
 • సీతారాముల కళ్యాణం ఘట్టం ఒక ఆచారం ఓ సాంప్రదాయం;—–
 • సీతారాముల కళ్యాణం కోసం మిథిలా నగరానికి విచ్చేసిన దశరథ మహారాజు వశిష్టా విశ్వామిత్ర మహర్షిల సమక్షంలో.
  ‘ నా కుమార్తె సీతను శ్రీరామచంద్రునికి నా తమ్ముని కూతురు ఊర్మిళను లక్ష్మణునికి ,ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపిస్తాను ఆమోదించండి అని స్వయంగా జనక మహారాజు వివరించడం, అంటే మఖా నక్షత్రం నుండి మూడో రోజు ఉత్తర ఫాల్గుణనక్షత్రం ఈ మూడు రోజులు పెండ్లి సంబంధించిన క్రియలు అన్నీ వైభవంగా జరపడానికి నిశ్చయించడం జరిగింది. రామలక్ష్మణుల చేత గోదానము భూదానము తిల సువర్ణాధి దానాలను బ్రాహ్మణులకు ఇప్పించండి అని జనక మహారాజు కోరాడు వెంటనే విశ్వామిత్రుడు మహారాజా మీ ఉభయవంశాలు సాటి లేనివి విశిష్టమైనవి మీ ఇరువంశాలలోని రాజులు ఎల్లరు మహా ధార్మికుడు, రామలక్ష్మణులు సీత ఊర్మిళలు మహా గుణ సంపత్తి గల జంటలు మీ తమ్ముడు కుష ద్వజుడు ధార్మికుడు ఆయన కూతుళ్లు మాండవి శృత కీర్తిలు మంచి అందగత్తెలు ఆ ఇరువురిని భరత శత్రాజ్ఞుల కిచ్చి వివాహం జరిపించండి దశరథుని నలుగురు కుమారుల రూప యవ్వన సంపన్నులు మహా పరాక్రమ వీరులు ఈ వివాహ బంధం వల్ల మీ ఉభయ వంశాలు సంబంధ బాంధవ్యాలు దృఢ పడతాయి అని విశ్వామిత్రుడు వ్యాఖ్యానించాడు అంటే రామాయణంలో మహర్షి లాంటి పెద్దలు మంచి ముహూర్తమును చూసి వివాహ నిశ్చయాన్ని చేసిన దాన్ని మనము నేటి కూడా ఆచరణలో పెడుతున్నాము రామాయణ మూల గ్రంథంలో చెప్పినట్లు వివాహ చట్టంలో జనక మహారాజు ఈ విధంగా తన కూతుర్ని శ్రీరామచంద్రునికి ఇస్తూ ఈ విధంగా పలుకుతున్నాడు చిరంజీవి ఈమె లావణ్యవతి సీత నా కూతురు మా వంశ ప్రతీక నేటి నుండి నీ సహధర్మ చారిని కష్టసుఖాల్లో ధర్మార్థ కామ సాధనలో నీకు తోడుగా ఉంటుంది .ఈమని పాణిగ్రహణం చేయి ఈ మహాసాధి ఎల్లప్పుడూ నీడలా నిన్ను అనుసరిస్తుంది అంటూ మంత్రజలం చల్లి కన్యాదానం చేశాడు జనక మహారాజు అదే రీతిన ముగ్గురు కుమార్తెలను లక్ష్మణ భరత శత్రజ్ఞులకు ఇచ్చి మంత్రజలప్పము చల్లి కన్యాదానం చేశాడు జనక మహారాజు ఇంత గొప్ప మైన వివాహ కార్యక్రమం రామాయణంలో మహోత్సవంగా మనకు కనిపిస్తుంది.