Breaking News

ఎన్నికల ప్రచారంలో బాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ .

కరీంనగర్ పట్టంలోని రేకుర్తి చౌరస్తా లో ఎన్నికల ప్రచారంలో బాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ,మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇతర ముఖ్య నేతలు.
మంత్రి పొన్నం ప్రభాకర్. మే 13 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ని గెలిపించండి.
మీ అందరి ఆశీర్వాదం తో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది..
2014-23 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎంత మంది కి డబుల్ బెడ్రూం లు కట్టించారు ? బిఆర్ఎస్ ప్రభుత్వంలో 3016 నిరుద్యోగ భృతి రాలేదు.
దళిత బంధు రాలేదు. ఉద్యోగాలు రాలేవు. లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.
500 కి గ్యాస్ అందిస్తున్నాం.200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఎన్నికలు అయిపోగానే గత 10 ఏళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు ఇస్తాం.
కొత్త పెన్షన్లు ఇస్తాం, పాత పెన్షన్లు 4000 చేస్తాం. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.
బీజేపీ బిఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దు. ఈ జిల్లా మంత్రి గా ,మా ఎమ్మెల్యేలతో పాటు రాజేందర్ రావు అభివృద్ధి లో సహకారంగా ఉంటారు. ఎంపి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది. నేను ఎంపిగా 5 సంవత్సరాలు చేశా. నా తరువాత వినోద్ కుమార్, బండి సంజయ్ ఎంపిగా ఉన్నారు. వినోద్ కుమార్ ఎన్నికల తరువాత వరంగల్ వెళ్తారు. వినోద్ కుమార్ కి ఓటు వేస్తే మోరి లో వేసినట్టే.
బండి సంజయ్ ఈ నియోజకవర్గానికి , రేకూర్తి కి ఏం చేశారో చెప్పాలి.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి ఎందుకు తొలగించారు. అవినీతికి పాల్పడినందుకు కాదా.
గత ఎన్నికల్లో భార్య మంగళ సూత్రాలు అమ్ముకున్న అని చెప్పావు. ఇప్పుడు వేల కోట్లు ఎట్లా సంపాదించవు, మేము అంత రామ భక్తులమే.
రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. మీరు చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలి , బీజేపీ పైన జై శ్రీరామ్ లో లోపల రిజర్వేషన్లకు రాంరాం చెబుతుంది .రిజర్వేషన్లకు రాం రాం చెప్పే కుట్ర జరుగుతుంది. బీజేపీ మోసాలను ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి రాజేందర్ రావు ని గెలిపించండి.