Breaking News

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ .

పిఠాపురంలో తన మామ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ . కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త నల్లాల శ్రీధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సాయిధరమ్ తేజ్ ఆయనను పరామర్శించారు. కొద్దిసేపు అక్కడే ఉండి జనసేన కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ. వైసీపీ గూండాలకు దీటుగా విజయం సాధించిందన్నారు. కాగా, ఈ దాడిని సీపీఎం వాళ్లే చేసిందని జనసేన కార్యకర్తలు పేర్కొంటున్నారు.