Breaking News

ఎన్నికల ప్రచారానికి ప్రధాని సుడిగాలి పర్యటన.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని నందూర్బార్లో ఉదయం 11:30గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 3:15గంటలకు మహబూబ్ నగర్ లోని ఎన్నికల సభకు హాజరవుతారు. అక్కడ్నుంచి తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఒడిశాకు వెళ్తారు. భువనేశ్వర్ లో రాత్రి 8:30 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ కు చేరుకుని హోటల్ తాజ్ కృష్ణలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భువనగిరిలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడునుంచి బయల్దేరి ఏపీలోని విజయవాడలో 6.45 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.