Breaking News

సోవరింగ్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం.

గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఇవాళ్లి నుంచి ఈనెల 16 వరకు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుంది. గ్రాము ధరను రూ.6,263గా ఆర్బీఐ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న నాలుగో సిరీస్ ఇది.
ఈ ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లో మూడు విడతలుగా బాండ్లను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఒక్కో గ్రాము రూ.6,213కే లభిస్తుంది.