Breaking News

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సీడీ చవాన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఓయూ కళాశాల నుండి సనత్ నగర్ వరకు భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా సిడి చవాన్ మాట్లాడుతూ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే రాష్ట్రంలో కూడా హాలిడేను ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నామని. వచ్చే సంవత్సరం వరకు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు సెలవుదినంగా ప్రకటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్,సంజయ్, అనిల్ , రమేష్ , బాబా పాండురంగ, సందీప్, దిలీప్ గానాటే, అనంతలక్ష్మి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు