Breaking News

రేపు ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా.

జిల్లా ఉపాధికల్పన ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సోమవారం ఆ శాఖ అధికారి కొండపల్లి శ్రీరాములు తెలిపారు. జీడీఏ, ఎంపీహెచ్ డబ్ల్యూ, ఏఎన్ఎం,
జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న వారికి అపోలో హోం, హెల్త్ కేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హోం కేర్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు 21న ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ కళాశాల టేకులపల్లిలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.