Breaking News

ఈ నెల చివరి వారంలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌?

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెల చివరి వారంలో “గ్రూప్ 1” నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొత్తగా చేర్చిన పోస్టుల గ్రూప్ 1 నోటిఫై చేసేందుకు TSPSC చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని TSPSC యోచిస్తోంది, ఈనెల 19న దీనిపై విచారణ జరగనుంది.

అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఈ నెల చివరివారంలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ అసెంబ్లీలో ప్రకటన చేసింది. 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం..ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్నట్లు తెలిపింది.గత ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు (10 సంవత్సరాలు) పెంచగా.. ఈ ప్రభుత్వం రెండు యేళ్లు పెంచింది.